మన్యం న్యూస్, సారపాక :
భద్రాద్రి సీతారామచంద్రస్వామి కల్యాణమహోత్సవ సందర్భంగా విచ్చేయుచున్న భక్తులకు జలగం బ్రదర్స్ ఐటీసీ కాంట్రాక్టర్ జలగం చంద్రశేఖర్, బిఆర్ఎస్ పార్టీ బూర్గంపాడు మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్ లు సారపాక గ్రామంలో గురువారం ఏర్పాటు చేసిన శ్రీరామ ప్రసాద సేవ (అన్నదాన కార్యక్రమం)ను మహబూబాబాద్ ఎంపీ కవిత, కటికనేని హరిత లు ప్రారంభించారు. స్వామివారి ప్రసాదాన్ని భక్తులకు వారి చేతుల మీదగా అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాలోతు కవిత మాట్లాడుతూ… భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి సేవలో జలగం బ్రదర్స్ ఉండటం సంతోషకరమైన విషయమని, ఇటువంటి సేవలు చేయటం శుభదాయకమని వారిని అభినందించారు. భక్తుల సేవలో ప్రతి ఒక్కరూ ఉండాలని ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని కోరుకున్నారు. ఈ అన్నదాన కార్యక్రమంలో సుమారు 3000 మంది అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిఐ నాగరాజు, ఎస్సై సంతోష్ కుమార్, సొసైటీ చైర్మన్ బిక్కసాని శ్రీనివాస్, బిఆర్ఎస్ పార్టీ సారపాక టౌన్ ప్రెసిడెంట్ కొనకంచి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.