మన్యం న్యూస్, మంగపేట.
శ్రీరామ నవమి ని పురస్కరించుకొని మండలం వ్యాప్తంగా ఉన్న అన్ని దేవాలయాలు భక్తులతో నిండిపోయాయి. మండలం లోని అన్ని గ్రామాల్లో శ్రీ రామ నవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
మంగపేట మండలం రాజుపేట గ్రామం లో శ్రీ రామ నవమి వేడుకలు ఘనంగా పండితుల వేద మంత్రాల నడుమ రాములోరి కళ్యాణం కమనీయము గా కన్నుల పండుగ గా నిర్వహించడం జరిగింది. రాములోరి కల్యాణ మహోత్సవం లో భార్య భర్తలు జంటలుగా కూర్చొని కళ్యాణం వేడుకలు జరిపించారు.