మన్యం న్యూస్,అన్నపురెడ్డిపల్లి మార్చి 30: మండల పరిధిలోని పెద్దిరెడ్డిగూడెం గ్రామంలో హైవే ప్రక్కన భద్రాచలం వెళ్లే భక్తులకు మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని గురువారం బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బోయినపల్లి సుధాకర్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలం వెళ్లే భక్తులకు ఎండకి ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో మజ్జిగ ఇవ్వడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ నున్న బసవయ్య,రహీం,గ్రామస్తులు,తదితరులు పాల్గొన్నారు.