మన్యం న్యూస్,ఇల్లందు టౌన్:భాజాభజంత్రీలు, వేదమంత్రాలు, ముత్యాల తలంబ్రాలతో పండగ వాతావరణంలో సీతారాముల కల్యాణాన్ని ఎంతో కమనీయంగా పట్టణంలోని ప్రతి వార్డులలో ఘనంగా నిర్వహించారని ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు అన్నారు. శ్రీరామనవమి వేడుకలను పురస్కరించుకుని ఇల్లందు పట్టణంలో వివిధ వార్డులలో వేద మంత్రోచ్ఛరణల మధ్య కన్నులపండువగా జరిగిన సీతారాముల కల్యాణ మహోత్సవంలో మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు సతీసమేతంగా పాల్గొన్నారు. సీతారాముల కళ్యాణాన్ని తిలకించి తీర్థప్రసాదాలను స్వీకరించారు. అనంతరం పట్టణంలో పలు వార్డులలో నిర్వహించిన సీతారాముల కళ్యాణ వేడుకలకు సతీసమేతంగా హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు వార రవి, కటకం పద్మావతి, కుమ్మరి రవీందర్, గిన్నారపు రజితరవి, కో ఆప్షన్ సభ్యులు బాసా శ్రీనివాస్ రావు, బారాస పట్టణ ప్రధాన కార్యదర్శి పరుచూరి వెంకటేశ్వర్లు, బారాస పట్టణ యువజన అధ్యక్షులు మెరుగు కార్తీక్, కార్యదర్శి గిన్నారపు రాజేష్, అయ్యప్ప గుడి చైర్మన్ ఎల్ కృష్ణ, మహిళా అధ్యక్షురాలు నెమలి ధనలక్ష్మి, బారాస నాయకులు అబ్దుల్ నబి, కృష్ణారావు, సన, రాజేష్, మహేష్, లలిత్, మాడిశెట్టి రాజు, నాగరాజు, అక్కపల్లి సతీష్ ,పెద్దినేని రామకృష్ణ, ఏజీపీ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
