మన్యం న్యూస్, దమ్మపేట, మార్చి, 30: శ్రీ రామనవమి సందర్భంగా అశ్వారావుపేట నియోజక వర్గ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు దమ్మపేట మండలంలో పలు రామాలయాలు సందర్శించి స్వామి వారి కళ్యాణ మహోత్సవం తిలకించారు. మండల పరిదిలోని నాయుడుపేట, గణేష్ పాడు, నాగుపల్లి, పట్వారి గూడెం, సుదాపల్లి, చిల్లగుంపు, దమ్మపేట మండల కేంద్రంలోని కాపుల బజార్, సాయిబాబా దేవాలయం, బంజారాకాలనీ, అర్బన్ కాలనీ, గాంధీనగర్, ముష్టిబండ, మొద్దులగుడెంల్లో నిర్వహిస్తున్న శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని తిలకించి, స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు, వైస్ ఎంపీపీ దారా మల్లికార్జున్ రావు, దొడ్డకుల రాజేశ్వరరావు, పోతినేని వెంకట్ రావు, ఎంపీటీసీ కేదేసి రాధ, దారా యుగంధర్, సోయం చంటి, కొయ్యల అచ్యుత్ రావు, మాజీ ఎంపీటీసీ శ్రీను, రాయల నాగేశ్వరరావు,యార్లగడ్డ బాబు తదితర ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.