- జయహో రేగా…
- అభివృద్ధిలో ముందడుగు
- స్వతంత్రం వచ్చిన నాటినుంచి కానీ పనులు సైతం పూర్తి
- గిరిజన పల్లెల్లో రేగా బలగం
మన్యం న్యూస్ గుండాల… ఆయన రాకతో పల్లెలన్నీ వికసిస్తున్నాయి . ఏళ్ళ కాలం నాడు పరిష్కారానికి నోచుకోలేని పనులన్నీ చక చక జరిగిపోతున్నాయి. పల్లె జనం సంక్షేమం కోసం మౌనిక సదుపాయాల కల్పనలో.. ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న అభివృద్ధి పనులకు ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావుకు జయహో అంటున్న గిరిజనం. గుండాల, ఆళ్లపల్లి మండలాలలో రేగా చేపడుతున్న అభివృద్ధిని చూసి గిరిజన పల్లెలో ఆదరణ పెద్ద ఎత్తున పెరుగుతుంది. ఉమ్మడి గుండాల మండలంలో రేగా కాంతారావుకు ప్రజా బలగం పెద్ద తయారయ్యారు. ఈ మధ్యకాలంలోనే మోదుగుల గూడెం నుండి సజ్జల బోర్డు వెళ్లే వంతెన పనులను పూర్తి చేయించారు. దీనితోపాటు కొడవ పంచ నుండి నడిమిగూడెం వరకు బీటీ రోడ్డు కలవర్ట్ లను పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. చెట్టుపల్లి నుండి పోచారం రోడ్డు పనులను సైతం పూర్తి కావడంతో ఆరాదారి కూడా ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. స్వతంత్రం వచ్చిన నాటినుండి కానీ పనులను సైతం రేగ కాంతారావు రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పూర్తిస్థాయిలో పనులను పూర్తి చేశారు. ఇదివరకే ఉమ్మడి గుండాల మండలంలో అనేక వాగులపై వంతెనలను రహదారులను పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువచ్చారు. వర్షాకాలంలో నిత్యం మంచినీటి సమస్యతో సతమతమయ్యే గిరిజన గ్రామాలు గత రెండు మూడు సంవత్సరాల నుండి వేసవి కాలంలో కూడా పూర్తిస్థాయిలో నీళ్లు రావడంతో ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. రానున్న రోజుల్లో ఇలాగే ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని గిరిజన ప్రజలతో పాటు అన్ని వర్గాల ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు