మన్యం న్యూస్ గుండాల..మండలం పరిధిలోని మామ కన్ను గ్రామంలో గల ఏకలవ్య పాఠశాల లో ప్రవేశం కొరకు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ సంధ్యారాణి శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. ఆరో తరగతి ప్రవేశం కొరకు పాఠశాలలో మొత్తం 60 సీట్లు ఉన్నాయని 30 బాలురు, 30 బాలికలకు కేటాయించబడినట్లు ఆమె పేర్కొన్నారు. ఏప్రిల్ 20వ తారీకు లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు .