మన్యం న్యూస్ దుమ్ముగూడెం::
మండలంలోని దుమ్ముగూడెం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఉపాధ్యాయుడు లక్ష్మణ్ 17 మంది విద్యార్థులకు పెన్స్, పాడ్స్ అందించారు. అనంతరం పదవ తరగతి విద్యార్థులకు హాల్ టికెట్లను ప్రధానోపాధ్యాయులు ఆపక శంకర్ విద్య కమిటీ సభ్యులు షేక్ హుస్సేన్ అహ్మద్ చేతులమీదుగా అందించారు అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థులు పరీక్ష కేంద్రానికి 45 నిమిషాల ముందు చేరుకోవాలని ఎటువంటి ఒత్తిడి లోనవ్వకుండా ప్రశాంతంగా పరీక్షలు రాసి విజయం సాధించి స్కూల్ కి మంచి పేరు తీసుకురావాలని కోరారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు బాలాజీ లక్ష్మణ్ రామకృష్ణ సత్యనారాయణ సునీత రజని సరోజిని తదితరులు పాల్గొన్నారు