మన్యం న్యూస్ దుమ్ముగూడెం::
తెలంగాణా రాష్ట్ర గవర్నర్ తమిళ సై సౌందర్య రాజన్ ప్రముఖ పుణ్యక్షేత్రమైన పర్ణశాలను శుక్రవారం పర్యటిo చవలసి ఉండగా ఆ పర్యటన అర్దతరంగా రద్దు అయింది శుక్రవారం నాడు భద్రాచలంలో జరిగే శ్రీరాముని పుష్కర పట్టాభిషేకం కార్యక్రమానికి హాజరై సాయంత్రం మూడు గంటలకు ప్రముఖ పుణ్యక్షేత్రమైన పర్ణశాలను సందర్శించేందుకు ఆమె పర్యటన షెడ్యూలు నిర్ణయించబడింది దీంతో ఆలయ అధికారులు స్థాన ఘట్టాల రేవు ప్రాంతం నుంచి ఆలయం లోపటివరకు తివాచీలు పరిసి ఆలయాన్ని పూలమాలలతో సుందరంగా అలంకరించడంతోపాటు ఆలయ ముఖ ద్వారం వద్ద పూలతో స్వాగతం బోర్డుని తయారుచేసి అలంకరించి ఆమెకు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు సిద్ధం కాగా పోలీస్ శాఖ కూడా గట్టి భద్రత ఏర్పాట్లను చేపట్టారు గవర్నర్ రాక సందర్భంగా ఆలయమునకు వెళ్లే ప్రధాన మార్గంలో ఇరువైపులా ఆలయ పరిసర ప్రాంతాలలో చిరు వ్యాపారుల దుకాణాలను భద్రతా చర్యలలో భాగంగా శుక్రవారం ఉదయం నుంచి తొలగించారు. దీంతోపాటు మధ్యాహ్నం 12 గంటల వరకు పర్ణశాల ఆలయంలోకి సాధారణ భక్తులను అనుమతించిన పోలీసులు 12 గంటల అనంతరం ఆలయంలో భక్తుల దైవదర్శనాలను నిలిపివేశారు. పోలీసులు అధికార యంత్రాంగం తప్ప గుడి పరిసర ప్రాంతాలలో ఇతరులు ఎవరిని అనుమతించలేదు. ఈ తరుణంలో గవర్నర్ రాక కోసం అధికారులు ఎదురుచూస్తున్న వేళ గవర్నర్ పర్ణశాల రాక రద్దు అయినట్లు అధికారులకు సమాచారం అందింది. ఆమె రాక కోసం వేయికళ్లతో ఎదురుచూసిన స్థానిక ప్రజలకు స్థానిక ప్రజలకు అధికారులకు ప్రజాప్రతినిధులకు నిరాశే మిగిలింది ఆమె పర్యటన రద్దుతో అధికారులు చేపట్టిన విస్తృత ఏర్పాట్లు వ్యయ ప్రయాసలు వృధా అయ్యాయి. మూడున్నర గంటల తర్వాత పర్ణశాలకు చేరుకున్న భక్తులు యధావిధిగా ఆలయంలో సీతారామచంద్ర స్వామివార్లను దర్శించుకున్నారు.