మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
రెండు సంవత్సరాలకు ఒకసారి గిరిజనుల సాంప్రదాయ పద్ధతిలో అత్యంత ఘనంగా నిర్వహించే పెద్దమ్మ తల్లి జాతర శని ఆదివారాల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం చుంచుపల్లి తండాలో అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. జాతర ఎంతో ప్రత్యేక విశిష్టతను కలిగి ఉందని గిరిజన పూజారులు బుజ్జి రామారావు రామకృష్ణ కృష్ణంరాజు ఆలయ కమిటీ సభ్యులు శుక్రవారం తెలియజేశారు ఈ జాతరకు మొదటిరోజు శనివారం వివిధ గ్రామాల నుంచి భారీ స్థాయిలో ప్రజలు హాజరై మొక్కులు తీర్చుకుంటారని రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారని ప్రతి రెండేళ్లకు ఒకసారి జరిగే జాతర ప్రత్యేక విశిష్టతను కలిగి 15 రోజులు జరిగే పెద్దమ్మ తల్లి కొలుపు రెండవ రోజు ఆదివారం తెల్లవారుజామున పెద్దమ్మ తల్లి కళ్యాణ అనంతరం అగ్గిపుల్ల ప్రవేశం బోనాలు సమర్పణతో ముగిస్తుందని పెద్దమ్మ తల్లి కొలుపు నిర్వాహణ కమిటీ సభ్యులు తెలియజేశారు. గిరిజనులు గిరిజన నేతరులు ఐకమత్యంగా జాతరను నిర్వహించుకోవడం విశేషం