UPDATES  

 కష్టపడి చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలి – జడ్పిటిసి కామారెడ్డి శ్రీలత..

మన్యం న్యూస్, బూర్గంపాడు/సారపాక :

విద్యార్థులు చిన్ననాటి నుంచి నిర్దిష్టమైన లక్ష్యాలు ఏర్పరచుకొని కష్టపడి చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని జెడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత అన్నారు.

శుక్రవారం బూర్గంపహాడ్ బాలుర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో  ఏర్పాటు చేసిన పదవ తరగతి విద్యార్థుల వీడ్కోలు సమావేశంలో పాల్గొని విద్యార్థులు పదవ తరగతి పరీక్షలు రాయబోవుచుండగా విద్యార్థులకు మంచి సలహాలు సూచనలు అందజేశారు. విద్యార్థులు పరీక్షలో మంచి ప్రతిభ కనబరిచి పాఠశాలకు తల్లితండ్రులకు, ఉపాధ్యాయులకు, మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని కోరుకున్నారు. పరీక్షల సమయంలో ఎక్కువ ఒత్తడికి లోను కాకుండా ప్రశాంతమైన ఆలోచన తో ఉండి పరీక్షల్లో మంచి మార్కులు సాధించాలని చెప్పారు. పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు అందరికి అల్ ది బెస్ట్ తెలియజేసి, ఆటల పోటిలల్లో విజేతలకు బహుమతులు అందజేసారు. ఈ కార్యక్రమం లో బూర్గంపహాడ్ మండల జడ్పీటీసీ కమిరెడ్డి శ్రీలత తోపాటు మండల ప్రధాన కార్యదర్శి జక్కం సుబ్రహ్మణ్యం, మైనార్టీ సెల్ అధ్యక్షుడు సాదిక్ పాషా, కేసుపాక రామేష్, బొందయ్యా, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !