UPDATES  

 ప్రభుత్వం ప్రజల కనీస అవసరాలు తీర్చాల్సిందే….

మన్యం న్యూస్ ఇల్లందు రూరల్:- సిపిఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీ అధ్వర్యంలో ఇల్లందు మండలం ముకుందాపురం క్యాంప్ సెంటర్లో ముకుందాపురం, మామిడిగుండాల ఏరియా పార్టీ ముఖ్య కార్యకర్తల జనరల్ బాడీ సమావేశం శుక్రవారం జరిగింది.  ముఖ్యవక్తగా ఆవునురి మధు  హాజరై మాట్లాడారు. మామీడిగుండాల, ముకుందాపురం ఏరియాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం చాలా దూరంగా ఉండటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నరని తక్షణమే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత నాలుగు దశాబ్దాలుగా పోడు వ్యవసాయం చేసుకొని జీవిస్తున్న గిరిజన, గిరిజనేతర పేదలకు పట్టా హక్కులు కల్పించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని విమర్శించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ ప్రకారం పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేసి కట్టించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ముకుందాపురం క్యాంప్ సెంటర్ నుంచి లచ్చగూడెం వరకు రహదారి నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు.నిత్యవసర సరుకుల ధరలు, పెట్రోల్,డీజిల్, వంటగ్యాస్,కరెంట్ చార్జీలను తగ్గించాలని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలను ఆయన డిమాండ్ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రజలు ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.

అనిల్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో యాకన్న నరాటి వెంకటేశ్వర్లు,బొగ్గారపు సంగయ్య,బొగారపు వెంకన్న, కల్తీ సుభద్ర.   వెంకటమ్మ ఈ సం  భద్రమ్మ ఈసాల లక్ష్మీ సొమన్న, అన్నా బత్తుల. వెంకన్న  వెమూరీ  రంగయ్య  కాంపాటి కొటయ్య బాలాజీ, అజ్మీర రమణయ్య తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !