- ఎస్సీ ఎస్టీ కమిషన్ నియామకం ఇంకెన్నాళ్లకు….
- అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.50వేలు ఇవ్వాలి
- దళిత బంధు పథకం ఏక కాలంలో దళితుల అందరికీ ఇవ్వాలి
- తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు
- డాక్టర్ పసుల రాంమూర్తి
మన్యం న్యూస్, మంగపేట.
తెలంగాణ మాల మహానాడు మంగపేట మండల కేంద్రంలో ముఖ్య నాయకుల సమావేశం జిల్లా అధ్యక్షులు రాజమల్ల సుకుమార్ అధ్యక్షతన శనివారం జరిగినది ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు. డాక్టర్ పసుల రాంమూర్తి హాజరై ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఒకసారి ఎస్సీ ఎస్టీ కమిషన్ మాత్రమే ఏర్పడిందని అన్నారు. గత మూడు సంవత్సరాల నుంచి ఎస్సీ ఎస్టీ కమిషన్ ఏర్పడకపోవడం ఏర్పాటు చేయకపోవడం దళిత వ్యతిరేక ప్రభుత్వం పనే అన్నారు. రాష్ట్రంలో 25 శాతం ఉన్న షెడ్యూలు కులాలు, షెడ్యూలు తెగలు ఎస్సీ ఎస్టీ రక్షణ సంక్షేమ రిజర్వేషన్ చట్టాల అమలులో జరుగుతున్న అన్యాయాలను అధిగమించేందుకు ఎస్సీ ఎస్టీ కమిషన్ ఆశ్రయించే వర్గాల వారికి పూర్తి స్థాయి కమిషన్ లేకపోవడంతో సరైన న్యాయం జరగడం లేదు ఎస్సీ ఎస్టీల వర్గాలకు వెంటనే న్యాయం అందాలనే ఉద్దేశ్యంతో అయితే నిబంధనలకు అనుగుణంగా ఈ సేవ లేవు. ఇరు వర్గాల వారికి చేరటం లేదు అందుకే వీలైనంత త్వరగా ఈ కమిషన్ ఏర్పాటు చర్యలు చేపడితే మంచిదన్నారు. విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్కడ ఎస్సీ ఎస్టీ వర్గాల గుర్తించి పూర్తి చిత్తశుద్ధితో రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేసిందని,ఎన్నో కేసుల్లో బాధితులకు అండగా నిలుస్తూ 2019లో ఎస్సీ ఎస్టీ వర్గాలకు మెరుగైన సేవలు అందించాలని ఎస్టి కమిషన్ ఎస్సీ కమిషన్ ఏర్పాటు చేసింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అయిన తర్వాత టిఆర్ఎస్ ప్రభుత్వం ఫిబ్రవరి 2,..2018 తేదీన సాధారణ పరిపాలన శాఖ జీవో ఏo,ఎస్ 6 ద్వారా చైర్మన్ ఐదుగురు సభ్యులతో కూడిన కమీషన్ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.మూడేళ్ళ కాల పరిమితి పూర్తి కావడంతో తేదీ 26 ఫిబ్రవరి 2015తో పూర్తి అయిపోయింది. ప్రభుత్వం కమిషన్ను తిరిగి నియమించ కపోవడం బాధాకరం అన్నారు. కమిషన్ కు వచ్చి ఫిర్యాదు చేసిన దాదాపు 4 నుoచి 5 వేల పిటీషన్లు ఏలాంటి విచారణకు నోచుకోకుండా నెలల తరబడి పండింగ్ లో ఉంటున్నాయిని ఆరోపించారు. గంపెడు ఆశతో ఎన్నో వ్యయ ప్రయాసలతో హైదరాబాద్ కు వచ్చి కమిషన్ లో పిర్యాదు చెయ్యగానే తమకు మేలు జరిగిపోతుoదని ఆశతో ఇళ్లకు వెళ్లిన బాధితులకు వారి ఆశలు అడియాశలు అవుతున్నాయన్నారు.. ప్రస్తుతం ఉన్న ఈ సమయంలో ఎస్సీ ఎస్టీ కమిషన్ ఏర్పాటు ఈ ప్రక్రియను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం త్వరగా చేపట్టాలని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చట్టం 2003 (యాక్ట్ 9ఆఫ్ 2003) నిబంధన చాప్టర్-2 రూల్(5)(1) (ఏ) ప్రకారం చైర్మన్ , సబ్ రూల్ బి ప్రకారం ఎస్సీ ఎస్టీ వర్గాలకు న్యాయం అందించేందుకు సమర్ధత పూర్తి చిత్తశుద్ధి నిస్వార్థ సేవలందించే ఐదుగురు వ్యక్తులను కమిషన్ సభ్యులుగా నియమించాలని ప్రభుత్వాని ఆయన డిమాండ్ చేశారు.
అకాల వర్షాల వలన నష్టపోయిన రైతులకు ఎకరాకు 50 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధు ఏకకాలంలో ఇవ్వాలని కోరారు.