మన్యం న్యూస్, అన్నపురెడ్డిపల్లి ఏప్రిల్ 1: ఈ నెల ఏప్రిల్ 3 నుంచి ఏప్రిల్ 13 వరకు నిర్వహించే పదవ తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని,మండల కేంద్రములో జెడ్పిహెచ్ఎస్ , టిఎస్ డబ్ల్యూఆర్ఎస్ రెండు పాఠశాలలను పరీక్షా కేంద్రాలుగ ఏర్పాటు చేశామని మండల విద్యాశాఖ అధికారి సత్తెనపల్లి సత్యనారాయణ అన్నారు.మండలంలోని మొత్తం 5 పాఠశాలలకు చెందిన 282 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారని అన్నారు.పరీక్ష కేంద్రాలల్లో సీటింగ్ ఏర్పాట్లు,లైట్స్,ఫ్యాన్స్, సిసి కెమెరాలు,శానిటేషన్, మంచి నీటి వసతి ఏర్పాటు చేశామనీ అన్నారు.పరీక్షా కేంద్రాల్లో పోలీస్ సిబ్బంది,హెల్త్ డిపార్ట్మెంట్ సిబ్బందిని ఏర్పాటు చేశామన్నారు.పరిసర ప్రాంతాలలో 144 సెక్షన్ ఏర్పాటు చేయబడిందని.ఈ పరీక్షలు నిర్వహించడానికి ఇద్దరు చీఫ్ సూపరింటెండెంట్లు,ఇద్దరు డిపార్ట్మెంట్ల అధికారులు,17మంది ఇన్విజిలేటర్స్ నియమించమన్నరు.పరీక్షా కేంద్రాల్లోకి విద్యార్థులను ఉదయం 8.45 నుంచి అనుమతించబడుతుందని, 9.30 తరువాత ఎవరినీ అనుమతించమని ఆయన అన్నారు.