- సూర్య చిల్లర రాజకీయాలు మానుకో….
- -ధనసరి సూర్య పినపాక నియోజకవర్గం లో గ్రూప్ రాజకీయాలు మానుకోవాలి .
- – సేవా కార్యక్రమాల పేరుతో చిల్లర రాజకీయాలు చేస్తే ఊరుకోం.
- – స్థానికులకే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలి .
- – స్థానిక నాయకుల మనోభావాలను దెబ్బతీస్తున్న సూర్య పనితీరు.
- ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని పినపాక నియోజకవర్గ కాంగ్రెస్ కేడర్ కు, నాయకులకు , క్షమాపణలు చెప్పాలి .
- – ధ్వజమెత్తిన మణుగూరు మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు
మన్యం న్యూస్, మణుగూరు, ఏప్రిల్ 1: కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అయిన పినపాక నియోజకవర్గంలో ములుగు జిల్లా నుంచి వచ్చి దనసరి సూర్య పిల్ల చేష్టలు చేస్తున్నాడని, సూర్య గో బ్యాక్ అని మణుగూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పీరినాకి నవీన్, నాయకులు చందా సంతోష్ కుమార్, కాటిబోయిన నాగేశ్వరావులు అన్నారు. వారు శనివారం స్థానిక హనుమాన్ ఫంక్షన్ హాల్ నందు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ధ్వజమెత్తారు . స్థానికేతర వ్యక్తులు నియోజకవర్గంలో చొరబడి కాంగ్రెస్ పార్టీ నాయకుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారన్నారు. కొంతమందిని సొంతంగా సోషల్ మీడియా గా పెట్టుకొని ఇష్టం వచ్చినట్లు ప్రచారాలు చేస్తూ పబ్బం గడుపుతున్నారన్నారు. తన అనుచర గణంతో అధిష్టానం నిర్ణయం మేరకు వచ్చామని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ డబ్బాలు కొట్టుకుంటున్నారన్నారు. పినపాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి అన్యాయం జరిగేలా ములుగు ఎమ్మెల్యే సీతక్క కుమారుడు సూర్య ప్రవర్తిస్తున్నాడన్నారు. పక్క జిల్లా నుండి వచ్చి నియోజకవర్గంలో నాయకుల మధ్య విభేదాలు సృష్టిస్తున్నాడన్నారు. పార్టీ జెండా మోసిన స్థానికులకే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని, స్థానికులకు ఇస్తే కష్టపడి పని చేసి గెలిపించుకుంటామన్నారు. రేగా కాంతారావు పార్టీని వదిలిన నాటినుండి జెండాను మోస్తూ పార్టీని కాపాడుకుంటున్నామని, అంతా కలిసి పార్టీని పూర్తి నిర్మాణం చేస్తే సూర్య అందులో జొరబడి అల్లకల్లోలం సృష్టిస్తున్నాడన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులం అందరం సమిష్టిగా ఉన్నామని, సీతక్క తనయుడు సూర్య మాత్రం డిసిసికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారన్నారు. అధిష్టానం నాకే టికెట్ ఇస్తుందని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి గందర గోలం చేస్తున్నాడన్నారు. ఇప్పటినుండి పినపాక నియోజకవర్గం లో దనసరి సూర్య తిరిగితే చూస్తూ ఊరుకోమన్నారు. అధిష్టానం నిర్ణయం మేరకు మేము పనిచేస్తుంటే సూర్య గ్రూపులు కట్టి పార్టీని విచ్చిన్నం చేస్తున్నాడన్నారు. మాలో మాకు తగాదాలు పెడితే ఊరుకునేది లేదన్నారు. సేవా కార్యక్రమాల పేరుతో సూర్య రాజకీయం చేస్తున్నాడన్నారు. రాజకీయ అనుభవం లేని యువకులను మండలానికి ఐదుగురిని పక్కన వేసుకొని చిల్లర రాజకీయాలు చేస్తున్నాడని, వారికి సెల్ ఫోన్లు కొనిస్తూ, ఖర్చులకు డబ్బులు ఇస్తూ సోషల్ మీడియా వేదికగా దుష్ప్రచారాలు చేయిస్తున్నాడన్నారు. దాన సరి సూర్య గో బ్యాక్ పినపాక నియోజకవర్గం నుంచి వెళ్లిపోవాలని ముక్తకంఠంతో ఖండిస్తున్నామన్నారు. సూర్య బేషరతుగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు క్షమాపణ చెప్పాలన్నారు. లేని పక్షంలో సంబంధించిన తరువాత జరగబోయే పరిణామాలకు ములుగు ఎమ్మెల్యే సీతక్క బాధ్యత వాయించాల్సి ఉంటుందన్నారు. ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, నియోజకవర్గ నాయకులు, యువజన నాయకులు, సోషల్ మీడియా సభ్యులు, మహిళా నాయకురాళ్లు తదితరులు పాల్గొన్నారు.