UPDATES  

 బతుకు చిద్రం చేసుకుంటున్న.. బెట్టింగ్ బంగార్రాజులు…

  • బతుకు చిద్రం చేసుకుంటున్న..
  • బెట్టింగ్ బంగార్రాజులు..
  • పల్లెలకు సైతం ఎగబాకిన క్రికెట్ ఫీవర్
  • యువతను అప్పుల పాలు చేస్తున్న క్రికెట్ బెట్టింగ్
  • బెట్టింగ్ సాకుతో నడ్డి విరుస్తున్న వడ్డీ వ్యాపారం
  • అప్పులు తీర్చలేక తనువు చాలిస్తున్న యువత
  • ఐపీఎల్ బెట్టింగ్ పై అధికారుల నజరేది….?

మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి..

అన్న పలానా టీం గెలుస్తదానే… ఏమోరా నాకైతే నమ్మకం ఉంది.. ఆ టీంలో ఆ ముగ్గురు పోయిన ఆశ ఉంది.. ఏమో అన్న రెండవ టీమ్ స్ట్రాంగ్ గా ఉంది. ఈసారి ఆ టీం గెలుస్తదేమో అన్న.. అరె ఊకోరా నా అనుభవంతో చెప్తున్నా.. నేను చెప్పినవులే ఆడతారు అనుకున్న టీం గెలుస్తారు.. ఈసారి ఒకటికి మూడు రెట్లు వస్తది పో… సరే అన్నా నీ మాటలు నిజం కావాలే.. దీన్ తడి పార్టీ చూడు ఎట్లుంటదో… ఆల్ ది బెస్ట్ తమ్ముడు ఆ టీం మీదనే బెట్టింగ్ పెట్టు.. బోలెడన్ని డబ్బులు పట్టు… సరే అన్న రూ. 10,000 వేలు ఇవ్వు… అనుకున్న వడ్డీ ఇస్తా… మస్తు పార్టీ ఇస్తా… ఇది ఎక్కడో ఇద్దరు స్నేహితులు మధ్య జరిగిన సరదా సంభాషణ కాదు… అందరినీ సరదాగా నవ్వు తెప్పించే టిక్ టాక్ షో కూడా కాదు… తల్లిదండ్రుల కలల సహకారాన్ని సమిధులు చేస్తూ, విలాస జీవితాలకు అలవాటు పడుతూ… నేడు ఎక్కడ చూసినా యువత ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ మూజులో పడి బతుకుచిద్రం చేసుకుంటున్నారు.. ఒకప్పుడు ఐపీఎల్ బెట్టింగ్లు పట్టణానికే పరిమితమై ఉండగా… ఏకంగా పల్లె ప్రాంతాలకు కూడా పాకి పల్లెల్లో పొలం పనులు చేసే యువత దగ్గర నుంచి చదువుకున్న యువకుల వరకు ఈ ఐపీఎల్ క్రికెట్ ఫీవర్ సోకింది. పని పాట లేకున్నా ఇంట్లో డబ్బులు లేకపోయినా… అత్యాశకు పోయి డబ్బులు సంపాదించాలనే మూదులు క్రికెట్ ఐపీఎల్ బెట్టింగ్ లకు దగ్గరయ్యారు.. మొదట సరదాగా ఉండి రెండు మూడు మ్యాచ్లకు అధికంగా డబ్బులు రావడంతో అత్యాశకుపై యువత మరింత బెట్టింగ్ మోజులో పడి అప్పుల ఊబిలో చిక్కుకుంటున్నారు.. ఎక్కడ చూసినా ఐపీఎల్ క్రికెట్.. క్రికెట్… క్రికెట్

 

మార్చి 31 నుంచి ఐపీఎల్ (20–20) క్రికెట్ పండగ.

క్రికెట్ ప్రేమికుల్లో ఎడతెగని ఉత్కంట. ఉరిమే ఉత్సాహంతో క్రికెట్ ఆటగాళ్లు మైదానంలో కనిపించస్తుంటే వారు కొట్టే ఫోర్లు సిక్సర్లకు బెట్టింగ్ బంగార్రాజుల జేబులు నింపుతాయని ఆశగా టీవీలు వైపు చూస్తున్నారు50 రోజుల పైగా అభిమానులకు కను విందు చేయనున్న క్రికెట్ సంబరం. కొంతమందికి ఆనందాన్ని ఇస్తే మరికొందరికి ఈ ఆట అప్పుల పాలు చేస్తుంది.. ఐపీఎల్ క్రికెట్ ఆట ఆనందం కోసమే కానీ బెట్టింగ్ ల కోసం కాదని.. పలువురు అభిప్రాయ పడుతున్న ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్లను నియంత్రించడంలో పోలీస్ శాఖ డక్ ఔట్ అవుతుంది

ఐ పి ఎల్ లో గెలిచినా, ఓడినా క్రికెటర్లకు కోట్ల రూపాయలు ఆదాయం క్రీడాకారులు గడిస్తారు.. ఏ జట్టులో అయితే తను నమ్ముకున్న క్రీడాకారుడు అనుకున్న పరుగున లక్ష్యాన్ని సాధించి తనకు పైసలు సంపాదించి పెడతాడని ఆశ పడుతున్న బెట్టింగ్ గాళ్ళకు ఒక్కోసారి మతిభ్రమించే ఫలితం వస్తుండడంతో విస్తు పోవడమే గాక విసుకు చెంది అప్పులకు డబ్బులు తీసుకువచ్చి బెట్టింగులు పెట్టి ఆ అప్పు తీర్చలేని యువత బలవన్ మరణాలు పొందిన సందర్భాలు కూడా లేకపోలేదు. గతంలో ఐపీఎల్ బెట్టింగ్ పెట్టి బతుకులు ఆగమాగం చేసుకున్న యువతను చూసేనా కనువిప్పు కలుగుతుంది అని అనుకుంటే.. అదే మోజులు పడి యువత బతుకులు అంధకారాన్ని చేసుకుంటున్నారు. బెట్టింగ్ మోజులో పడి రాజులు పేదలై, పేదలు నిరుపేదలై బతుకు తెల్లారుతున్నప్పటికీ అనుభవం నేర్పిన పాఠాన్ని నేర్చుకోలేని పరిస్థితుల్లో యువత కొట్టుమిట్టాడుతుంది

 

క్రికెట్ బెట్టింగ్ స్లో పాయిజన్.

తాను అనుకున్న జట్టుపై బెట్టింగ్ పెట్టి గెలిస్తే కాలర్ ఎగరేయడం.. ఓడిపోతే ఒక్కసారిగా కుదిలైపోవడం వంటి సందర్భాలు చూస్తూనే ఉన్నాము.

మొదట్లో సరదా, ఆపై వ్యసనం, తదుపరి అప్పులు, చివరికి మానసికంగా పతనం అయ్యి చిల్లర పనులు, విషయం అర్ధం అయ్యే సరికి అంతా శూన్యం. కనిపించిన తల్లిదండ్రులకు దూరమై.. బతుకు భారమై తనువు చాలించుకునే యువత తస్మాత్ జాగ్రత్త

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !