UPDATES  

 రాష్ట్రస్థాయిలో గౌతమ్ పూర్ గ్రామ పంచాయతీకి నేషనల్ పంచాయతీ అవార్డ్స్ 2021- 22  సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించిన జిల్లా కలెక్టర్ అనుదీప్ ..

మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి 2021 -22వ సంవత్సరంనకు హెల్దీ పంచాయతీ విభాగంలో రాష్ట్రస్థాయిలో జిల్లా కేంద్రంలోని కొత్తగూడెంలోని గౌతoపూర్ గ్రామపంచాయతీ నేషనల్ పంచాయతీ అవార్డు ద్వితీయ బహుమతి సాధించడం పట్ల జిల్లా కలెక్టర్ అనుదీప్ హర్షం వ్యక్తం చేశారు. శనివారం జిల్లా ఐ డి ఓ సి కార్యాలయంలో అవార్డు అందుకున్న ఎంపిడిఓ రమేష్, ఎంపిఓ సత్యనారాయణ, సర్పంచ్ పోడియం సుజాత, జక్కంపూడి షర్మిలను ఆయన ప్రత్యేకంగా అభినందించారు జిల్లా కలెక్టర్ అనుదీప్ చేతులు మీదుగా సర్టిఫికేట్, షీల్డ్ అందుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మార్చి 31న హైదరాబాద్ లోని ఆడిటోరియం, రాజేందర్ నగర్ నందు నేషనల్ పంచాయతీ అవార్డ్స్ తీసుకోవడం జరిగిందని చెప్పారు. షీల్డ్ ను రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు నుంచి స్వీకరించబడటం ఎంతో ఆనందదాయకం అన్నారు ఇంకా ముందు ముందు ఎన్నో రకాల అవార్డులు సాధించాలని, గ్రామపంచాయతీ అభివృద్ధి కొరకు మంచి మంచి పనులు చేస్తూ ముందుకు వెళ్లాలని ఆయన ఆకాంక్షించారు . ఈ అవార్డు ద్వారా మరింత బాధ్యత పెరిగిందని గుర్తు చేశారు. అనంతరం అవార్డు గ్రహీతలు జిల్లా పంచాయతీ అధికారి రమాకాంత్ ను మర్యాదపూర్వకంగా కలవడం జరిగినది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పోడియం సుజాత, పం, ఎంపీడీవో సకినాల రమేష్, మండల పంచాయతీ అధికారి గుంటి సత్యనారాయణ . పంచాయతీ కార్యదర్శి జక్కంపూడి షర్మిల తదితరులు పాల్గొన్నారు

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !