- వేచన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో
- అంగన్వాడి చిన్నారులకు కుర్చీలు,
- పదవ తరగతి విద్యార్థులకు ప్యాడ్ లు వితరణ.
- సేవా కార్యక్రమాలతో ముందుకు సాగుతున్న వేచన్ ఫౌండేషన్.
మన్యం న్యూస్. ములకలపల్లి. ఏప్రిల్ 01.నలుగురికి చేయూతనివ్వాలనే ఆకాంక్ష, సాధ్యమైనంతలో సేవ చేయాలనే తపనతో, పాల్వంచ కేంద్రంగా నడుస్తున్న వేచన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో లొ అంగన్వాడి చిన్నారులకు కుర్చీ లు,పదవ తరగతి పరీక్షలకు హాజరుకానున్న విద్యార్థులకు ప్యాడ్లను శనివారం వితరణ చేశారు. ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న విజయ శంకర్ దంపతుల జేష్ట కుమారుడు వేచన్ అకాల మరణం అనంతరం, వారి కుమారుడి జ్ఞాపకార్థం వేచన్ ఫౌండేషన్ ప్రారంభించి,పలు సేవా కార్యక్రమాలను గడిచిన కొన్ని సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు. మండలం లోని పుసుగుడెం గ్రామంలోని పకిర్ తండా అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులు పడుతున్న ఇబ్బందులను గమనించిన వేచన్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు కుర్చీల వితరణకు చేసారు.మండలం లోని పొగళ్లపల్లి ఉన్నత పాఠశాల నుండి పదవ తరగతి పరీక్షలకు హాజరు కానున్న విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు, పెన్నులను అందించారు.ఈ సందర్భంగా ఫౌండేషన్ వ్యవస్థాపకులు విజయ శంకర్ మాట్లాడుతూ వేచన్ ఫౌండేషన్ ద్వారా జరిగే కార్యక్రమాలను మున్ముందు మరింత విస్తరించి, అనేకమంది పేద వారికి చేయూతనివ్వాలనే కృతనిష్చయంతో ముందుకు సాగుతున్నామని,
హాస్టల్లో ఉండి చదువుకునే పేద విద్యార్థిని విద్యార్థులకు నోటు పుస్తకాలు అందించడంతోపాటు వారి అవసరాలను పలువిధాలుగా సహాయం అందిస్తున్నామని ఫౌండేషన్ వ్యవస్థపకులు తెలిపారు.ఈ కార్యక్రమం లొ అంగన్ వాడి ఉపాధ్యాయులు, పాఠ శాల ప్రధానోపాధ్యాయులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.