మన్యం న్యూస్ చండ్రుగొండ ఏప్రిల్ 01: పదో తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి అయినట్లు మండల విద్యాశాఖాధికారి సత్యనారాయణ అన్నారు. శనివారం స్థానిక సెయింట్ జోసెఫ్ పాఠశాలలో పరీక్షల ఇన్విజిలెటర్లకు శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ నెల 3 నుండి 13 తేదీ వరకు పరీక్షలు జరుగుతాయని, ఉదయం 8:45 నిమిషాల నుండి 9:30 నిమిషాల వరకు విద్యార్థులను పరీక్ష కేంద్రం లోనికి అనుమతిస్తామన్నారు. పరీక్షా కేంద్రంలోనికి సెల్ ఫోన్లు, ఎలక్ట్రికల్స్ వస్తువులను అనుమతించమని, ఇద్దరు చీఫ్ సూపరిండెంట్లు, ఇద్దరూ డిపార్టుమెంటల్ అధికారులు, 17 మంది ఇన్విజిలెటర్లు పరీక్షల విధుల్లో ఉంటారన్నారు. చండ్రుగొండ, అన్నపురెడ్డిపల్లి మండలాలకు చెందిన 262 మంది, విద్యార్థులు పరీక్షలు వ్రాస్తారన్నారు. ఈ కార్యక్రమంలో పరీక్షల అధికారులు పాల్గొన్నారు.