మన్యం న్యూస్,ఇల్లందు టౌన్..ఇల్లందు నియోజకవర్గ పరిధిలోని 21 ఫిట్ ఏరియా భూపేష్ నగర్, విజయలక్ష్మి నగర్ నందు జరుగుతున్న శ్రీ బుడియా బాపు జాతర మహోత్సవానికి నిర్వాహకులు మాలోత్ లక్ష్మణ్ సాధు ఆహ్వానం మేరకు ఇల్లందు నియోజకవర్గ శాసనసభ్యురాలు హరిప్రియ హరిసింగ్ నాయక్ శనివారం ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అనంతరం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి ఇల్లందు నియోజకవర్గ ప్రజలందరు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో చుక్కసాదు, భూక్యా ఆంగోత్, రమేష్ సాదు, సీతారాం సాదు, శక్రామ్ సాదు, రాంపాల్ సోమ్లా, సేవలే సాదు, ఇల్లందు మండల ప్రధాన కార్యదర్శి ఖమ్మంపాటి రేణుక, ఉపసర్పంచ్ తాండ్ర నాగరాజు, ఇల్లందు పట్టణ ప్రధాన కార్యదర్శి పరుచూరి వెంకటేశ్వరరావు, ఇల్లందు మండల కోఆప్షన్ సభ్యులు ఘాజి, ఇంద్రానగర్ వార్డ్ మెంబర్ నీలం రాజశేఖర్, గ్రామ శాఖ ప్రధాన కార్యదర్శి వి. రాజేశ్వరి, ఇల్లందు పట్టణ యూత్ ప్రధాన కార్యదర్శి మరియు సోషల్ మీడియా ఇన్చార్జి గిన్నారపు రాజేష్, ఎండీ.ఇంతీయాజ్, పూణేమ్ వెంకటేష్,ఆరెపల్లి సురేష్, గుగులోత్ వంశీ, సాధువులు తదితరులు పాల్గొన్నారు.