UPDATES  

 దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులుగా బందెల నర్సయ్య..రాష్ట్ర సహాయ కార్యదర్శిగా సలిగంటి శ్రీనివాస్,..

  • దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులుగా బందెల నర్సయ్య
    రాష్ట్ర సహాయ కార్యదర్శిగా సలిగంటి శ్రీనివాస్, ఉపాధ్యక్షురాలిగా రత్నకుమారి ఎన్నిక
    ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లకోసం ఉద్యమిస్తాం : బందెల నరయ్య

మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధిదళిత హక్కుల పోరాట సమితి (డిహెచ్ఎఎస్) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా కొత్తగూడెం, రుద్రంపూర్ ఏరియాకు చెందిన సీనియర్ నాయకులు బందెల నర్సయ్య ఎన్నికయ్యారు. ఇదే ప్రాంతానికి చెందిన సలిగంటి శ్రీనివాస్ రాష్ట్ర సహాయ కార్యదర్శిగా, లక్ష్మి దేవిపల్లి మండలం శేషగిరినగర్కు చెందిన కె.రత్నకుమారి ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైంది. ఇటీవల హైద్రాబాద్ లోని ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ లో జరిగిన రాష్ట్ర మహాసభలో వీరిని ఎన్నుకున్నారు. వీరితోపాటు మరో ముగ్గురికి జిల్లా నుంచి కార్యవర్గంలో స్థానం లభించింది. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు బందెల నర్సయ్య మాట్లాడుతూ ప్రైవేటు రంగంలో రిజర్వేషన్ల అమలుకోసం దశలవారి ఉద్యమాలు చేపడతామన్నారు. అదేవిదంగా సబ్ ప్లాన్ నిధులు ఇతర శాఖలను మల్లించకుండా చర్యలు చేపట్టాలని, దళితబంధు పథకం ఎంపిక ప్రక్రియలో జరుగుతున్న అవినీతి అక్రమాలను నివారించేందుకు ఎంపిక ప్రక్రియను ఎమ్మెల్యేల నుంచి తొలగించి కలెక్టర్లకు అప్పగించాలని డిమాండ్ చేశారు. దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తానన్న ముఖ్యమంత్రి కేసీఆర్ హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. బిజెపి పాలనలో దళితులపై దాడులు హెచ్చుమీరుతున్నాయని, ఎన్ని రక్షణ చట్టాలు చేసినా వాటిని అతిక్రమిస్తూ మతోన్మాద దాడులలకు పాల్పడుతున్నారన్నారు. సాతంత్ర్యం సిద్ధించి ఏడు దశాబ్దాలు దాటినప్పటికి గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో దళితులకు ఉండటానికి ఇల్లు, చేసుకోవడానికి పని దొరకని పరిస్థితి నెలకొందన్నారు. రిజర్వేషన్ల రద్దుకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కుట్ర చేస్తుందని, దళిత, గిరిజనులంతా మేల్కోని మోడీ ప్రభుత్వంపై తిరగబడాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర మహాసభ ఆమోదించిన తీర్మాణాలపై దశలవారి ఆందోళనలు చేపడతామని స్పష్టం చేశారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !