మన్యం న్యూస్, అశ్వారావుపేట ఏప్రిల్ 01..అశ్వారావుపేట పట్టణంలో రైతు వేదిక వద్ద ఐసిడిసీ వారి ఆధ్వర్యంలో శనివారం చిరుదాన్యాల అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అన్ని విధాలుగా ఐసీడిసీ సిబ్బందికి సహకరిస్తున్న ఎమ్మెల్యే మెచ్చా అంటూ కొనియాడి సిబ్బంది మెచ్చాను శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా చిరు దన్యాల ఉపయోగాల గురించి ఎమ్మెల్యే మెచ్చా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామూర్తి, మండల నాయుకులు పలువురు పాల్గొన్నారు.