మన్యం న్యూస్ వాజేడు. ములుగు జిల్లా వాజేడు మండలం పేరూరు గ్రామపంచాయతీ, పిసా హ్యాబిటేషన్ పరిధిలో పీసా గ్రామసభ సర్పంచ్ యాలం సరస్వతి అధ్యక్షతన నిర్వహించారు. ఆదివాసి కుటుంబాలు నివాసం ఉంటున్న, పేరూరు గ్రామంలో రెండు వీధులకు, 10 లక్షల రూపాయలతో రెండు సిసి రహదారి నిర్మాణం మంజూరు అయినట్టు గ్రామస్తులకు విధితమే, ఎస్టిమేషన్ తీసుకున్న వీధికే సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టాలని పిసా గ్రామసభలో తీర్మానం చేశారు. ఆదివాసీలను అభివృద్ధి పేరుతో శతాబ్ద కాలం పాటు షెడ్యూల్ ఏరియా ప్రాంతంలో నివసిస్తున్న ఆదివాసీ ప్రజలకు కనీసం రహదారి సౌకర్యం, డ్రైనేజీ, వ్యవస్థ లేక ప్రభుత్వంతో పోరాటం చేసి తెచ్చుకున్న నిధులను సైతం ఆదివాసి ప్రజలకు అందుబాటులో లేకుండా చేసే కుట్ర పేరూరు గ్రామపంచాయతీలో తేట తెల్లం అవుతున్నట్లు గ్రామస్తులు తెలిపారు. ఇకనైనా ఆదివాసీల హక్కులకు , ఆదివాసి చట్టాలకు లోబడి అభివృద్ధి చేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సెక్రెటరీ ఉయిక రమేష్, పీసా ఉపాధ్యక్షులు కురుసం ప్రసాద్, పీసా కార్యదర్శి గొడ్డె సుధాకర్, టింగ బుచ్చయ్య , రఘుపతి, కృష్ణమూర్తి, గ్రామ పెద్దలు, గ్రామస్తులు పాల్గొన్నారు