- అంతా మాయజాలం
మున్సిపాలిటీ టెండర్ వండర్
ఓ కంపెనీకి టెండర్ కట్టబెట్టడంలో మతలభేమిటి…?
మున్సిపల్ కార్యాలయం ఎదుట అధికార పార్టీ కౌన్సిలర్ల నిరసన
మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
కొత్తగూడెం మున్సిపల్ కార్యాలయంలో అంతా మాయాజాలం.. నిబంధనలకు విరుద్ధంగా టెండర్లు నిర్వహించడమే కాకుండా తన అనుకున్న వర్గానికి ఆ టెండర్ ఇప్పించడంలో మున్సిపల్ అధికారులు కొందరికే గుట్టు చప్పుడు కాకుండా అందలా లెక్కిస్తున్నారు. నిబంధనకు నీళ్లు వదలటమే కాకుండా టెండర్ ప్రక్రియను సైతం పక్కదారి పట్టిస్తున్నారని నిరసిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని కొత్తగూడెం మున్సిపల్ కార్యాలయం ఎదుట శనివారం అధికార పార్టీకి చెందిన కొందరు కౌన్సిలర్లు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు ఆరోపిస్తూ కొత్తగూడెం మున్సిపాలిటీలో కోట్ల రూపాయల అవినీతి జరుగుతున్న మున్సిపల్ కమిషనర్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ పై తీవ్రమైన ఆరోపణలు చేసిన అధికార పార్టీకి చెందిన నాయకులు కొత్తగూడెం మున్సిపాలిటీ కౌన్సిలర్ పద్ధతిలో వచ్చే పనులను తమకు ఇష్టం వచ్చిన వారికి ఇచ్చుకుంటూ ప్రజా సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు . అంతేకాకుండా క్వాలిటీ టెస్టింగ్ టెండర్ లో ఆన్లైన్లో నిర్వహించకుండా బాక్స్ టెండర్ పద్ధతి ప్రకారం నిర్వహించారు అందులో ఎటువంటి కారణాలు చెప్పకుండా ఒక టెండర్ను రద్దు చేశారని తమకు నచ్చిన క్యూబ్ కంపెనీకి టెండర్లు ఇచ్చే విషయంలో లక్షల రూపాయలు చేతులు మారాయని అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్లు టిఆర్ఎస్ నాయకులు తీవ్రమైన విమర్శలు చేయడం జరిగింది. ఈ విషయంపై కలెక్టర్ వెంటనే స్పందించి మున్సిపల్ కమిషనర్ పై విచారణ జరిపించాలని వారి డిమాండ్ చేశారు.