హిందీ సినిమా ‘కిసీ కా భాయ్ కిసీ కా జాన్’ నుంచి లేటెస్టుగా ‘బతుకమ్మ…’ సాంగ్ విడుదల అయ్యింది. ఆ సినిమాలో కథానాయిక పూజా హెగ్డేను మన హైదరాబాదీ అమ్మాయిగా చూపిస్తున్నారు. అందుకని, తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా బతుకమ్మ పాటను రూపొందించారు. పాటలో తెలుగు సాహిత్యం వినబడుతుంది. కుందనపు బొమ్మలా పూజా హెగ్డే నృత్యం చేశారు. సల్మాన్ ఖాన్ సినిమా అయినా సరే… సాంగులో హైలైట్ మాత్రం పూజా హెగ్డేనే. గతంలో ముకుందాలో గోపికమ్మగా, అలా.. వైకుంఠపురంలో బుట్టబొమ్మగా అదరగొట్టిన పూజ ఇపుడు బతుకమ్మగా వస్తోంది.