ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ లెక్క కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. తెలంగాణలో బెంగాల్ తరహా పాలనను కొనసాగించాలని కేసీఆర్ చూస్తున్నారని మండిపడ్డారు. లిక్కర్ స్కాం కేసు నుంచి బిడ్డను కాపాడేందుకు రాత్రింభవళ్లు కష్టపడుతున్నారని విమర్శించారు.