మన్యం న్యూస్, దమ్మపేట, ఏప్రిల్, 02: దమ్మపేట మండల పలు గ్రామాల సర్పంచులు ఎంపీ నామాను ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఖమ్మంలో ఎంపీ నామా నివాసంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయుకులు మన్నెం అప్పారావుతో కలిసి జమేదార్ బంజర్, లింగాలపల్లి పంచాయితీ సర్పంచులు పంచాయితీలోని పలు సమస్యలు గురుంచి ఎంపీ నామా ను మర్యాద పూర్వకంగా కలిసి వివరించారు. సానుకులకంగా స్పందించిన ఎంపీ నామా సమస్యలు పరిస్కారం దిశగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు పాశం ప్రసాద్, వాడే శ్రీనివాసరావు, యువనాయకులు ఎలికే నాగబాబు తదితరులు పాల్గొన్నారు.
