మన్యం న్యూస్,ఇల్లందు టౌన్:ప్రజాపంపిణీ వ్యవస్థ (రేషన్ షాపులు) ద్వారా పేద,మధ్యతరగతి వర్గాల ప్రజలకు పన్నెండు రకాల నిత్యావసర సరుకులు, పది కేజీల సన్నబియ్యం ఉచితంగా అందచేయాలని సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా జిల్లా నాయకులు రేస్ బోస్ బుర్ర వెంకన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఆదివారం పట్టణంలోని స్థానిక ఎల్లన్న విజ్ఞాన కేంద్రంలో సీపిఐ ఎంఎల్ ప్రజాపంథా ముఖ్యుల సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని, అలాగే వార్డుకు పదిమంది చొప్పున డబుల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వాలని పేర్కొన్నారు. సిపిఐ ఎంఎల్ ప్రజాపందా రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈనెల 10 నుండి 20 తారీకువరకు ఇల్లందు పట్టణంలో పార్టీపట్టణ కమిటీ ఆధ్వర్యంలో బస్తీలలో సర్వేచేసి ఇల్లులేని నిరుపేదలకు ఇండ్లస్థలాలు ఇవ్వాలని, ఇండ్లస్థలాలు ఉన్నవారందరికీ డబుల్ బెడ్ రూమ్లు మంజూరుచేయాలని గతంలో పట్టణంలోని వార్డులలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు పదిమంది చొప్పున ఎంపికచేసి టెండర్లు పిలిచారనీ నేటికి డబుల్ బెడ్ రూమ్ల నిర్మాణం ఏ ఒక్కటి జరగలేదన్నారు. గతంలో కోరం కనకయ్య, ప్రస్తుత ఎమ్మెల్యే భానోత్ హరిప్రియ అధికార పార్టీ ఎమ్మెల్యేలుగా ఉన్నప్పటికీ ఇల్లందు మున్సిపాలిటీలో పేదప్రజలకు డబుల్ బెడ్ రూములు అందని ద్రాక్షలాగనే మిగిలిపోయాయి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈవిషయాలపై ఏప్రిల్ ఇరవై తారీకు మున్సిపల్ కార్యాలయం ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో సీపీఐ ఎంఎల్ ప్రజాపంధా ఇల్లందు పట్టణకార్యదర్శి షేక్ యాకుబ్ షావలి, మల్లెలవెంకటేశ్వర్లు, శేషయ్య, బండి వెంకటమ్మ, కే.వీరన్న, రంజాన్, వేములగురు నాథం తదితరులు పాల్గొన్నారు.
