- కార్యకర్తలే బిఆర్ఎస్ పార్టీకి బలం..
- నియోజకవర్గానికి రూ.1000 కోట్లు నిధులు…
- అశ్వరావుపేట శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు…
మన్యం న్యూస్ చండ్రుగొండ ఏప్రిల్ 02 : బిఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే బలమని అశ్వరావుపేట శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం అయ్యన్నపాలెం గ్రామంలోని లక్ష్యగార్డెన్స్ నందు జరిగిన బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో ఎంపీ నామ నాగేశ్వరరావు తో కలిసి ఆయన పాల్గొని ప్రసంగించారు. తొలుత పార్టీ జెండాను డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం ఆవిష్కరించారు. అనంతరం జరిగిన పార్టీ కార్యకర్తల సమ్మేళనంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత నాలుగేళ్లలో చండ్రుగొండ మండలానికి 4400 మంది ఆసరా పింఛన్లు మంజూరు చేయడం జరిగిందని, 92 మంది రైతు కుటుంబాలకు రైతు బీమా క్రింద రూ 4. 62 కోట్లు అందజేయడం జరిగిందన్నారు. కళ్యాణలక్ష్మి పథకం క్రింద రూ 8.32 కోట్లు లబ్ధిదారులకు నేరుగా అందించామన్నారు. రూ 3.5 కోట్లుతో సీసీ రోడ్ల సైతం మంజూరు చేశామన్నారు. అర్హత కలిగిన ప్రతి పేద గిరిజన కుటుంబానికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లును కట్టించి ఇవ్వడం జరిగిందన్నారు. ఇంకా మిగిలిన ఇతర వర్గాలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లనుమంజూరు చేస్తామన్నారు.ప్రతి కార్యకర్త కుటుంబాన్ని అన్నివేళలా కాపాడుకుంటామన్నారు. కార్యకర్తల కష్టం మీదనే ప్రభుత్వం నడుస్తుందని, ప్రతి కార్యకర్త సంక్షేమమే మా ధ్యేయమన్నారు.
* తెలంగాణపై కేంద్రం చిన్నచూపు…
ఖమ్మం పార్లమెంటు సభ్యుడు నామా నాగేశ్వరరావు…
తెలంగాణ రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వానికి చిన్న చూపు ఉందని ఖమ్మం పార్లమెంటు సభ్యుడు నామ నాగేశ్వరరావు అన్నారు. తెలంగాణకు రావాల్సిన ఫ్యాక్టరీలను ఇతర రాష్ట్రాలకు బిజెపి ప్రభుత్వం తరలిస్తుందని ఆరోపించారు. జీఎస్టీ పేరుతో పేదలపై భారం కేంద్ర ప్రభుత్వం మోపుతుందన్నారు. దేశంలో అన్ని రాష్ట్రాలలో భూగర్భ జలాలు తగ్గుతుంటే కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే పెరుగుతున్నాయని ఇది ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్పతనమన్నారు. తెలంగాణలో రైతులకు 24 గంటలు కరెంటు ఇవ్వడంతో పాటు, ప్రతి రైతు కుటుంబానికి రైతుబంధు అమలు చేస్తుందన్నారు. మన రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్రాలలో అమలు కావడంలేదని,కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు కాపీ కొట్టి దొడ్డిదారిలో అమలు చేయాలని చూస్తుందని ఆరోపించారు. ఈ సమ్మేళనంలో రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ రావు రాజేశ్వరరావు, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్ష, ప్రధానకార్యదర్శి దారా వెంకటేశ్వరరావు, ఉప్పతల ఏడుకొండలు, జిల్లా నాయకులు మేడా మోహన్ రావు, బోయినపల్లి సుధాకర్ రావు, సయ్యద్ రసూల్, భూపతి శ్రీనివాసరావు, భూపతి రమేష్, జడ వెంకయ్య, గాదె శివప్రసాద్, దొడ్డకుల రాజేశ్వరరావు, పైడి వెంకటేశ్వరరావు, నల్లమోతు వెంకటనారాయణ, చిద్దేళ్ళ పవన్ కుమార్, సూరా వెంకటేశ్వరరావు, వంకాయలపాటి బాబురావు, పాన్ల అంజన్ రావు, బానోతు రన్య,గుగులోత్ సునీత, బానోత్ కుమారి, బుక్య రాజి, పూసం వెంకటేశ్వర్లు, గాదె లింగయ్య, బానోత్ బీలు, ఎండి ఇమామ్, సత్తి నాగేశ్వరరావు మద్దిరాల చినపిచ్చయ్య, బాటి రామారావు, శ్రావణ్, శ్రీకాంత్, హనుమంతరావు,తదితరులు పాల్గొన్నారు