మన్యం న్యూస్, అశ్వారావుపేట, ఏప్రిల్, 02: బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు ఆదివారం అశ్వరావుపేట నియోజకవర్గ పరిధిలోని చండ్రుగొండ మండలం అయ్యన్నపాలంలో అశ్వారావుపేట నియోజక వర్గ శాసన సభ్యులు మెచ్చా నాగేశ్వర రావు అధ్యక్షతన నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళన సమావేశంలో అశ్వారావుపేట మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామమూర్తి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు అశ్వారావుపేట మండల నాయకులు మందపాటి మోహన్ రెడ్డి, సెట్టిపల్లి రఘురాం, యువజన నాయకులు మోటూరీ మోహన్ తదితరులు పాల్గొన్నారు.
