మన్యం న్యూస్, దమ్మపేట, ఏప్రిల్, 02: దమ్మపేట మండల కేంద్రంలో టిడిపి మాజీ మండల అధ్యక్షుడు నాయుడు చెన్నారావు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ ఆదివారం మృతి చెందగా వారి పార్థివదేహానికి పూలమాలవేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపిన అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తాటి వెంకటేశ్వర్లు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ పానుగంటి సత్యం, వైస్ ఎంపీపీ ధారా మల్లికార్జున రావు, చిట్టిబాబు, పోతినేని వెంకట్రావు, కె వి సత్యనారాయణ, కోటి, పానుగంటి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
