- నేనున్నానని …మీకేం కాదని
- ప్రతి కార్యకర్త కుటుంబానికి అండగా ఉంటా.
- రెండు ఇన్సూరెన్స్ లెక్కలను బాధిత కుటుంబాలకి అందజేసిన ప్రభుత్వ విప్ రేగా కాంతారావు
మన్యం న్యూస్ కరకగూడెం: ప్రతి కార్యకర్త కుటుంబానికి అండగా ఉంటానని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఅర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు అన్నారు. మండల పరిధిలోని కొర్నవల్లి గ్రామంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే నివాసంలో ఆదివారం బూర్గంపాడు మండల పరిధిలోని ఎస్సీ కాలనీ ఏరియా కు చెందిన మేక. వెంకట నరసయ్య(39)సం,, పినపాక మండల పరిధిలోని జానంపేట గ్రామానికి చెందిన కాటం.సమ్మయ్య 50సం,, ఇటీవల కాలంలో ప్రమాదవశాత్తు మరణించడంతో వారి కుటుంబాలకు బిఆర్ఎస్ పార్టీ తరఫున మంజూరైన రెండు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ చెక్కులను వారి కుటుంబ సభ్యులకు అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ సభ్యత్వం పొంది ప్రమాదవశాత్తూ మరణించిన ప్రతి కార్యకర్త కుటుంబానికి పార్టీ ఇన్సూరెన్స్ రెండు లక్షల రూపాయల బీమా అందజేస్తుందని అన్నారు. కంటికి రెప్పలా కాపాడుకుంటానని పేద ప్రజల కోసం నేటి బిఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని ఆయన అన్నారు.అనంతరం బాధిత కుటుంబ సభ్యులు మాట్లాడుతూ ఈ చెక్కులను మంజూరు చేసిన సీఎం కేసీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే పైగా కాంతారావుకి బాధిత కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బూర్గంపాడు జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత,పినపాక ఎంపీపీ గుమ్మడి గాంధీ, బిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు