UPDATES  

 ఓ మంచి ఫోటో ఎన్నో మధుర జ్ఞాపకాలను గుర్తు చేస్తుంది… మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతా లక్ష్మి  జిల్లా ఫోటోగ్రాఫర్ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు..

మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి

ఒక మంచి పుట ఎన్నో మొదటి జ్ఞాపకాలను గుర్తు చేస్తుందని కొత్తగూడెం మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీత లక్ష్మి అన్నారు ఆదివారం కొత్తగూడెం బూడిదగడ్డ ఏరియాలో స్థానిక శ్రీ స్నేహలత సంధ్యలత పిల్లల ఆశ్రమం నందు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు మైలవరపు రామకృష్ణ ,జిల్లా అధ్యక్షులు శ్రీనాథరాజు వెంకటపతి రాజు అధ్యక్షతన జిల్లా ఫోటోగ్రాఫర్స్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కొత్తగూడెం మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి పాల్గొన్నారు.అనంతరం కేక్ కట్ చేసి ఫోటోగ్రాఫర్స్ కి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేసినారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఫోటోగ్రాఫర్స్ ఈ కార్యక్రమంను పిల్లల ఆశ్రమంలో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు సమాజంలో ఫోటోగ్రాఫర్స్ అన్ని వర్గాలకు అతి చేరువుగా సేవలందిస్తూ వారి అభివృద్ధికై సంఘ బలోపేతానికై పాటుపడుతూ ఉన్నారని కొనియాడారు, జిల్లా వ్యవస్థాపక అధ్యక్షులు మైలవరపు రామకృష్ణ మాట్లాడుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏర్పడి ఈరోజుకి ఆరు సంవత్సరాలు పూర్తవుతుంది ఈ ఆరు సంవత్సరాల ఫోటోగ్రాఫర్స్ కుటుంబాలకి అన్ని విధాలా చేయూతనిస్తూ సంఘ సభ్యులు అందరినీ ఏకం చేసి అందరం కలిసికట్టుగా ఉంటున్నామని అన్నారు చనిపోయిన ఫోటోగ్రాఫర్స్ మిత్రుల కుటుంబాలకి ఆర్థిక సహాయం కూడా చేస్తూ అందరికీ మనం ఉన్నాం అని చెప్పి ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నాము అన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల వారు ఐకమత్యంతో ఉండి మంచి ఉపాధి అవకాశాలు కల్పించుకోవాలని భవిష్యత్తులో అందరూ కలిసికట్టుగా ఉండి మన సంఘాన్ని బలోపేతం చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర సంక్షేమ సంఘం కార్యదర్శి ముత్యాల రాజేష్, కొత్తగూడెం టౌన్ అధ్యక్షులు ఆడిచర్ల గణేష్ కోశాధికారి సుశీల్ గడ్డం ప్రభాకర్ ప్రవీణ్ సందీప్ శ్రీనివాస్ దేవి శ్రీను రజనీకాంత్ లక్ష్మణ్ శ్రీనాథ్ హైమద్ తదితర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !