UPDATES  

 పల్లెలన్నీ మురిసే ..రోడ్లన్నీ మెరిసే  పంచాయితీ రహదారులకు మహర్ధశ  ఇల్లందు ఎమ్మెల్యే బానోతు హరిప్రియ..

  • పల్లెలన్నీ మురిసే ..రోడ్లన్నీ మెరిసే
  • పంచాయితీ రహదారులకు మహర్ధశ
  • ఇల్లందు ఎమ్మెల్యే బానోతు హరిప్రియ

 

మన్యం న్యూస్ ఇల్లందు రూరల్ ఏప్రేల్ 2:-   ఇల్లందు మండల పరిధిలోని మామిడి గుండాల, లచ్చగూడెం, రేపల్లెవాడ, చల్లసముద్రం, ఒడ్డుగూడెం, ధనియాలపాడు పంచాయతీలలో డిఎంఎఫ్టి,ఎన్ఆర్ ఇజిఎస్ నిధులతో నూతన రహదారులకు ఆదివారం  ఇల్లందు ఎమ్మెల్యే బానోతు హరిప్రియ హరి సింగ్ నాయక్  శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ పాలనలో గ్రామీణ రహదారులకు మహర్దశ పట్టిందన్నారు. పల్లె పల్లెకు రాజమార్గం ఏర్పాటు కానుందన్నారు. నేడు ఆరు పంచాయతీలలో నూతన రహదారులకు డిఎంఎఫ్టి,ఎన్ఆర్ ఇజిఎస్ నిధులతో నూతన రహదారులకు శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు.మామిడి గుండాల గ్రామపంచాయతీలో డిఎంఎఫ్టి నిధులు రూ.20 లక్షలు, ఎన్ఆర్ ఇజిఎస్ నిధులు రూ. 20 లక్షలు, లచ్చగూడెం గ్రామపంచాయతీలో  డిఎంఎఫ్టి నిధులు రూ. 25 లక్షలు, రేపల్లెవాడ గ్రామపంచాయతీలో డిఎంఎఫ్టి నిధులు రూ. 15 లక్షలు, ఎన్ఆర్ ఇజిఎస్ నిధులు రూ.20 లక్షలు, చల్ల సముద్రం గ్రామపంచాయతీలో డిఎంఎఫ్ టి నిధులు రూ.15 లక్షలు, ఒడ్డుగూడెం గ్రామపంచాయతీలో డిఎంఎఫ్ టి నిధులు రూ. 20 లక్షలు, ఎన్ఆర్ ఇజిఎస్ నిధులు రూ. 20 లక్షలు, ధనియాలపాడు గ్రామపంచాయతీలో డిఎంఎఫ్ టి నిధులు రూ. 18 లక్షలు, ఎన్ఆర్ టిజిఎస్ నిధులు రూ. 20 లక్షలు రూపాయల నిధులు నూతన రహదారులకు మంజూరు అయ్యాయని తెలిపారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక గ్రామీణ పల్లెల రూపురేఖలు ఎంతగానో మారిపోయాయి అన్నారు. అంచలంచెలుగా గ్రామాలను అభివృద్ధి చేసుకోవడంలో ప్రజల భాగస్వామ్యం కూడా ఉందన్నారు.

గతంలో పంచాయతీల నుండి ఇల్లందుకు రావాలంటే గ్రామీణ ప్రజలు ప్రయాణంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కునే వారన్నారు. త్వరలోనే నూతన రహదారులను పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో జడ్పిటిసి ఉమాదేవి, వైస్ ఎంపీపీ దాస్యం ప్రమోద్ కుమార్, సర్పంచి సంఘాల అధ్యక్షులు కుంజ కృష్ణ, శీలం రమేష్, ,సర్పంచులు ఆలం కౌసల్య, మాడే సునీత,  నూనవత్ కృష్ణ, ఎంపీటీసీలు పూణే లింగమ్మ, జయమ్మ, గాజి,ఇంద్రనగర్ వార్డు నెంబర్ నీలం రాజశేఖర్, ఇల్లందు పట్టణ నాయకులు గిన్నారపు రాజేష్, శీను ,ముద్రయ్య, సూత్రం సమ్మయ్య, తాటి ముత్తయ్య, ఎట్టి కోటయ్య,  వెంకటేశ్వర్లు, కృష్ణ, పాపాలాల్, సిద్దు, వేణు ,సందీప్ , రమేష్, రాంబాబు, కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !