- సంక్షేమంలో తెలంగాణ రాష్టం నెంబర్ వన్.
- సీఎం కేసీఆర్ కృషితోనే రాష్ట్ర సమాగ్రా అభివృద్ధి
- పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు
మన్యం న్యూస్ కరకగూడెం: సంక్షేమ పథకాలు అమలులో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేస్తుందని సీఎం కేసీఆర్ కృషితోనే రాష్ట్ర సమగ్ర అభివృద్ధి సాధ్యం అవుతుందని పినపాక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు అన్నారు. ఆదివారం మండలపరిధిలోని,చిరుమళ్ళకొర్నవల్లి,మర్రిమోదల,పడిగపూరం గ్రామాలలో ఆయన విస్తృతంగా పర్యటించారు చిరుమళ్ళ గ్రామం నుంచి ఐలాపురం గ్రామం వరకు ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న రోడ్డు పనుల కోసం రూ. 60 లక్షల రూపాయలు నిధులతో చేపట్టనున్న నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.అనంతరం సమత్ భట్టుపల్లి గ్రామంలో సైడ్ డ్రైనేజ్ నిర్మాణం కోసం సుమారు రూ. 2 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.రేగళ్ల నుంచి పడిగాపురం వెళ్లే రహదారి పై హై లెవెల్ వంతెన నిర్మాణం కోసం సుమారు 3 కోట్ల రూపాయలు అంచనా వ్యయంతో నిర్మించనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.రేగళ్ల గ్రామపంచాయతీ పరిధిలో మద్దెలగూడెం, పడిగాపురం, మాదన్న గూడెం , గ్రామాలలో నూతనంగా రూ 24 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నూతనంగా నిర్మించుకున్న 3 అంగన్వాడి కేంద్రాలను ప్రారంభోత్సవం చేశారు.ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆశీస్సులతోనే పినపాక నియోజకవర్గం అభివృద్ధి చెందుతున్నదని అన్నారు.నియోజకవర్గంలోని పలు సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లగా స్పందించి అభివృద్ధి కోసం నిధులు విడుదల చేశారని అయ నిధులతో పినపాక నియోజకవర్గం అభివృద్ధి పథంలోకి నడిపిస్తున్నట్లు తెలిపారు.ఈ మధ్యకాలంలో నియోజకవర్గ అభివృద్ధి కోసం రూ.300 కోట్ల రూపాయలను సీఎం కేసీఆర్ కృషితో మంజూరైనట్లు ఆయన గుర్తు చేశారు.పల్లెల అభివృద్ధి ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుంది అన్నారు.బిఅర్ఎస్ ప్రభుత్వ పాలనలో ప్రతి పల్లె అభివృద్ధి చెందుతున్నదని తెలిపారు. రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నట్లు పేర్కొన్నారు.సీఎం కేసీఆర్ కృషితోనే దేశంలో రాష్ట్రం సుస్థిర అభివృద్ధి సాధించిందని అన్నారు.స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలనలో వ్యవసాయం, విద్య, వైద్యం, ఉపాధి రంగాలకు ప్రాధాన్యత కల్పిస్తూ అన్ని వర్గాల మన్ననలు ఆదుకుంటూ అభివృద్ధి ప్రదాతగా నిలిచారని అన్నారు. ఉమ్మడి రాష్ట్ర పాలనలో కన్నీరు నిలిచిన పాలకులు వ్యవసాయాన్ని స్వరాష్ట్రంలో కన్నుల పండగల మార్చిన ఘనత సీఎం కేసీఆర్ గారిదే అన్నారు . తెలంగాణలో రైతుబంధు రైతు బీమా ఉచిత విద్యుత్ తదితర సంక్షేమ పథకాల అమలుతో రైతుల జీవితాలలో వెలుగులు నిండి వ్యవసాయం వృద్ధి చెందుతున్నదని అన్నారు.సీఎం చేపట్టిన అద్భుతమైన సంక్షేమ పథకాలతో ప్రజల జీవన ప్రమాణ స్థాయి పెరిగి దేశానికి ఆదర్శంగా నిలిచారని అన్నారు. సీఎం తన ఆర్థిక విధానాలతో ప్రతి పల్లెలకు పునర్జీవన కల్పించారని, రైతుబంధు, పథకం ద్వారా వ్యవసాయాన్ని పండగల చేశాడని కొనియాడారు. రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఏదో ఒక సంక్షేమ పథకం అందించిన ఘనత సీఎం కేసీఆర్ దే అన్నారు. ఈ కార్యక్రమంలో కరకగూడెం మండలం ఎంపీపీ రేగా కాళికా, స్థానికి సర్పంచ్ లు పాయం.నర్సింహరావు,కుంజ వసంత రావు ఎంపిటీసి ఎలిపెద్ది సైలజ,మండల అధ్యక్షులురావుల.సోమయ్య పార్టీ ప్రజా ప్రతినిధులు,నాయకులు, కార్యకర్తలు,అభిమానులు, పార్టీ యువజన విభాగం నాయకులు,పలు శాఖల ప్రభుత్వ అధికారులు,స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.