మన్యం న్యూస్ మణుగూరు టౌన్: ఏప్రిల్ 02
మణుగూరు ఏరియా సింగరేణి కాలరీస్ హై స్కూల్ 10వ తరగతి విద్యార్థులకు ఏరియా జనరల్ మేనేజర్ దుర్గం రామచందర్ శుభాకాంక్షలు తెలియజేశారు.ఏప్రిల్ 3వ తేదీ నుంచి 10వ తరగతి విద్యార్థులకు పరీక్షల నేపథ్యంలో విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలి అని,ఒత్తిడి, భయానికి గురి కాకుండా ప్రశాంతంగా పరీక్షలకు హాజరుకావాలి అన్నారు. విద్యార్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరేలా తల్లిదండ్రులు చొరవ తీసుకోవాలి అని జీఎం దుర్గం రామచందర్ తెలిపారు. విద్యార్థులు తమ స్వయం కృషితోనే ప్రేరణ పొందాలని, అదే విజయానికి మూలమని తెలిపారు.పూర్తి ఆత్మస్థైర్యం, ఆత్మ విశ్వాసంతో పరీక్షలలో విజయం సాధించాలని అన్నారు.10/10 జి. పి.ఏ తో ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షిస్తూ,మంచి విద్యా సంస్థలలో సీట్లు సాధించాలని, తల్లిదండ్రులకు మంచిపేరు తీసుకురావాలి అని, విద్యార్థులకు సూచించారు. సింగరేణి పాఠశాలలు ఉన్నత ప్రామాణాల విద్యకు నిలయాలు అని,సింగరేణి యాజమాన్యం ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా, విద్యార్ధులకు సకల సౌకర్యాలతో పాటు వైజ్ఞానిక, సృజనాత్మకతతో కూడిన ఉన్నత విద్యను అందిస్తుంది అన్నారు.నేటి విద్యార్ధులు క్రమశిక్షణ,అంకితభావంతో,ఉన్నత చదువులు చదువుతూ, ప్రధమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధిస్తూ,గొప్ప విద్యావంతులుగా ఎదిగి తాము చదువుకున్న పాఠశాలకు పేరు ప్రతిష్టలు మరింతగా పెంచాలని జిఎం దుర్గం రామచందర్ సూచించారు.