మన్యం న్యూస్ కరకగూడెం: మండల పరిధిలోని చిరుమళ్ళ గ్రామంలో సమ్మక్క సారక్క దేవతలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మండలంలోని వివిధ గ్రామాలలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రేగా కాళికా,మండల అధ్యక్షులు రావుల సోమయ్య స్థానిక సర్పంచ్ పాయం. నరసింహారావు, సర్పంచులు ఊకె.రామనాథం, పోలెబోయిన. పాపమ్మ,కొమరం. విశ్వనాథం, పినపాక పిఏసిఎస్ చైర్మన్ పసునూరి రవిశేఖర్ వర్మ, పినపాక నియోజకవర్గ ఆత్మ కమిటీ చైర్మన్ పొనగంటి. భద్రయ్య, స్థానిక నాయకులు ప్రజాప్రతినిధులు కార్యకర్తలు పాల్గొన్నారు.
