మన్యం న్యూస్ కరకగూడెం: మండల పరిధిలోని పడిగాపురం గ్రామానికి చెందిన సుమారు 12 కుటుంబాలు సీఎం కేసిఆర్ చేపడుతున్న అభివృద్ధి పథకాలకు ఆకర్షితులై ఆదివారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తుందని దేశంలో ఎక్కడలేని విధంగా సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రేగా కాళికా, మండల అధ్యక్షులు రావుల. సోమయ్య,రెగళ్ళ.మాజీ సర్పంచ్ కొమరం. శ్రీను. బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
