దసరా సినిమా చూసిన తర్వాత హీరోగా నాని అదరగొట్టాడన్న వారితో పాటుగా వెన్నెల పాత్రలో కీర్తి సురేష్ కూడా ఇరగదీసింది అంటున్నారు. డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల రాసుకున్న వెన్నెల పాత్రను తెర మీద కీర్తి సురేష్ ఆవిష్కరించిన తీరు నెక్స్ట్ లెవల్. మహానటితోనే ఆమె ఎంత గొప్ప నటి అన్నది అందరికి తెలిసేలా చేసిన కీర్తి సురేష్ మహానటి తర్వాత అలాంటి సినిమా పడలేదు అనుకుంటున్న టైం లో దసరాతో ఆకలి తీర్చేసుకుంది. కీర్తి సురేష్ కి దసరా సినిమా మంచి కిక్ ఇచ్చింది. ఇన్నాళ్లు తన పని అయిపోయింది అనుకున్న వారికి కీర్తి వెన్నెల పాత్రతో తన సమాధానం చెప్పింది.
