పేపర్ లీకేజీ వ్యవహారాన్ని ప్రజా ఉద్యమంగా మారుద్దామని ప్రజా గాయకుడు గద్దర్ అన్నారు. రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడిన గద్దర్.. విద్యార్థులు ఊరూరికి వెళ్లి పేపర్ లీకేజీపై వివరించాలన్నారు. పేపర్ లీకేజీపై ఉద్యమానికి పార్టీలు ప్రణాళిక రూపొందిస్తే తాను తప్పకుండా విద్యార్థుల కోసం కొట్లాడుతానన్నారు. అవసరమైతే మళ్లీ తాను గోచి కట్టి, గొంగలి వేసుకుని గజ్జెలు కట్టుకుని గొడ్డలి చేతబడతానని చెప్పారు.
