మన్యం న్యూస్, పినపాక:
పినపాక మండల ఎంపీపీ కార్యాలయంలో తొలి తెలంగాణ రైతాంగ పోరాటయోధుడు, భూమి కోసం, భక్తి కోసం, మాతృభూమి విముక్తి కోసం ప్రాణాలను అర్పించిన అమరుడు దొడ్డి కొమరయ్యకు, సోమవారం ఆయన జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ గుమ్మడి గాంధీ, ఎంపీడీవో పల్నాటి వెంకటేశ్వరరావు, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు దొడ్డ శ్రీనివాస్ రెడ్డి, ఎంపీటీసీ చింతపంటి సత్యం, పొనుగోటి నరసింహారావు, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.