మన్యం న్యూస్,ఇల్లందు టౌన్..తెలుగుదేశం పార్టీ అనుబంధ విద్యార్థి సంఘం టీఎన్ఎస్ఎఫ్ నాయకుడు పనికర జస్వంత్ యాదవ్ 26వ జయంతిని స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీఎన్ఎస్ఎఫ్ పట్టణ అధ్యక్షులు దాసరి గోపాలకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ముందుగా జస్వంత్ యాదవ్ చిత్ర పటానికి పూలమాల వేసి, రెండు నిముషాలు మౌనం పాటించి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్బంగా టీడీపీ పట్టణ అధ్యక్షులు ముద్రగడ వంశీ, టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు చాందావత్ రమేష్ బాబు, పట్టణ అధ్యక్షులు దాసరి గోపాలకృష్ణ మాట్లాడుతూ…జస్వంత్ యాదవ్ చిన్న వయసులోనే తెలుగుదేశం పార్టీ కార్యక్రమలలో ఎంతో ఉత్సాహంగా పాల్గొనేవాడని, అదేవిధంగా టీఎన్ఎస్ఎఫ్ చేసే విద్యారంగ పోరాటలలో సైతం కీలకంగా వ్యవహరించేవాడు అని అన్నారు. గత సంవత్సరం మా అందరి మధ్యలో ఇదే టీడీపీ పార్టీ కార్యాలయంలో తన జన్మదిన వేడుకలు చేసుకున్నాడని జస్వంత్ నేడు మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరమని ఆయన లేని లోటు తీర్చలేనిదని వారు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జస్వంత్ యాదవ్ కుటుంబ సభ్యులు లిఖిల్, మనోజ్, టీడీపీ సీనియర్ నాయకులు శ్యామ్ తివారి, మనుబోతుల నర్సన్న ,అశోక్, టీఎన్ఎస్ఎఫ్ నాయకులు శ్రీవెద్, దేవరకొండ నవీన్ తదితరులు పాల్గొన్నారు.
