మన్యం న్యూస్, పినపాక:
పినపాక మండల సామాజిక కార్యకర్త తోలెం శ్రీనివాస్ తన సేవలను కొనసాగిస్తూనే ఉన్నారు. శ్రీనివాస్ అనే పేరు కంటే “మహర్షి” గానే అందరికి సుపరిచితుడు. ఎన్నో సంవత్సరాల నుంచి ఎందరో అభాగ్యులకు, స్వచ్ఛంద సేవా సంస్థలతో మాట్లాడి ఉచిత వైద్యం అందిస్తున్నాడు. తాజాగా కరకగూడెం మండలం తాటి గూడెం గ్రామానికి చెందిన జిమ్మిడి శ్రీను, పినపాక మండలం పిట్టతోగు గ్రామానికి చెందిన పోడియం ఎర్రయ్య చాలాకాలం నుంచి కాలిన గాయాలతో బాధపడుతూ ఉండగా, మార్చి నెలలో కొత్తగూడెంలో జరిగిన ఆరోగ్య శిబిరానికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించాడు. ఏప్రిల్ 5న హైదరాబాదులోని ఆకార్ ఆశ ఆసుపత్రిలో ఉచిత ఆపరేషన్ చేయిస్తున్నాను అని తెలియజేశారు.