మన్యం న్యూస్ ఏటూరు నాగారం
ములుగు జిల్లా ఏటూరు నాగారం మండల కేంద్రంలో మావోయిస్టులు విడుదల చేసిన లేఖ కలకలం రేపుతుంది.బిఆర్ఎస్ పార్టీ నాయకులపై మావోయిస్టు యాక్షన్ టీం బద్రు,వెంకటేష్ పేర్లతో హెచ్చరిక లేఖను విడుదల చేశారు.బిఆర్ఎస్ పార్టీ నాయకులు పద్ధతులు మార్చుకోకపోతే ప్రజల సమక్షంలో ప్రజా కోర్టులో శిక్ష తప్పదని లేఖలో హెచ్చరించారు.అదేవిధంగా ఫారెస్ట్ అధికారులు ప్రజలపై కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారని పోలీసు శాఖ కన్నా అటవీ శాఖ అధికారులు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని,ఫారెస్ట్ అధికారులు కూడా పద్ధతి మార్చుకోకుంటే శిక్ష తప్పదని లేఖలో పేర్కొన్నారు.అలాగే పోలీసు ఇన్ఫార్మర్లు ఇప్పటికైనా పద్ధతి మార్చుకుంటే మంచిదని లేఖలో పేర్కొన్నారు.అడవిలో పోలీసులు కూంబింగ్ ఆపకపోతే బిఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు నుంచి జిల్లా స్థాయి నాయకులను వదిలి పెట్టేది లేదని హెచ్చరించారు. మావోయిస్టుల లేఖ విడుదలతో అధికార పార్టీ నాయకులలో అలజడి మొదలైంది.ఈ వాల్ పోస్టర్లను పోలీసులు స్థానికులతో చేత తీయించి వేశారు.