మన్యం న్యూస్, పినపాక:
బీఆర్ఎస్ తొలి ఆత్మీయ సమ్మేళనానికి తరలిరావాలని బీఆర్ఎస్ కార్యకర్తలకు మండల అధ్యక్షులు పగడాల సతీష్ రెడ్డి పిలుపునిచ్చారు.
మండలంలోని తోగ్గూడెం పంచాయతీ గోపాలరావుపేట గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు డాక్టర్ రాజు ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ విప్ , ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆదేశాలతో పినపాక నియోజకవర్గం లో బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనాలు ఏప్రిల్ 5 నుండి ప్రారంభం కానున్నాయని తెలిపారు. మొట్టమొదటి ఆత్మీయ సమ్మేళనం పినపాక మండలం నుండి ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 5 బుధవారం కలవల నాగారం రాళ్లవాగు వద్ద ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం జరుగుతుందన్నారు.ఈ ఆత్మీయ సమ్మేళనానికి మండలంలోని 12 పంచాయతీల నుండి ముఖ్య కార్యకర్తలు, సర్పంచులు, వార్డ్ మెంబర్లు, ఎంపీటీసీలు పాల్గొనవలసిందిగా పిలుపునిచ్చారు. ప్రతి పంచాయతీ నుండి 150 మంది ముఖ్య కార్యకర్తలు కదలిరావాలని, బుధవారం బయ్యారం నుండి రాళ్లవాగు వరకు భారీ బైక్ ర్యాలీ ఉంటుందని ఈ ర్యాలీలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ సీనియర్ నాయకులు కోలేటి భవాని శంకర్,పినపాక ఎంపీటీసీ చింతపంటి సత్యం, కటకం గణేష్, ఉప సర్పంచ్ బుస్సి శ్రీనివాసరావు, ఆత్మ కమిటీ సభ్యులు సూర నరసింహారావు, గొగ్గల బజారు,జలగం రాములు గౌడ్, బండారు సమ్మయ్య,యాత్ లీడర్ అంకతి సతీష్, కేప సతీష్, ఊడుగుల రామచంద్రు, బూత్ కమిటీ అధ్యక్షులు కొంపెల్లి మల్లేష్, కొంపెల్లి నగేష్, జలగం అశోక్, అనిపెద్ది బాబురావు, గోరెంట్ల శ్రీనివాస్, పిట్టల రవి, పసల నారాయణ,కునారపు సత్యనారాయణ, అనిపెద్ది జంపయ్య,ఉప్పలి సతీష్,తదితరులు పాల్గొన్నారు.