మన్యం న్యూస్ దుమ్ముగూడెం::
మానవాళి పట్ల ఏసుక్రీస్తు మహా త్యాగానికి గుర్తుగా గుడ్ ఫ్రైడే అని మానవాళి పట్ల ప్రేమ నిస్సహాయ పట్ల కరుణ కలిగిన సిలువ వేసిన రోజు గుడ్ ఫ్రైడే ఆ తరువాత ఆయన పునర్జన్మించిన రోజు ఈస్టర్ సండే అని భద్రాచలం శాసనసభ్యులు పొదెం వీరయ్య అన్నారు. దుమ్ముగూడెం మండల పర్యటనలో ఆయన లక్ష్మీనగరం గ్రామంలోని చర్చిలో గుడ్ ఫ్రైడే సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలకు హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆకాశమంత సహనం అవధులు లేని త్యాగం జీసస్ ఇచ్చిన సందేశాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు. సమస్త ప్రజానీకానికి గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలిపారు అనంతరం కటాయిగూడెం గ్రామంలో దుమ్ముగూడెం యూత్ మండల అధ్యక్షులు కోడి చంటి వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు ఈ కార్యక్రమంలో ఆయన వెంట దుమ్ముగూడెం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు లంక శ్రీనివాసరావు మాజీ అధ్యక్షులు బైరెడ్డి సీతారామారావు సోషల్ మీడియా చైర్మన్ కను బుద్ధి దేవా డివిజన్ యూత్ అధ్యక్షులు లంక శివ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పిలక వెంకటరమణ రెడ్డి తెల్లం హరికృష్ణ దర్శి సాంబశివరావు సంగీతరావు ఉబ్బ వేణు తెల్లం నరేష్ తదితరులు పాల్గొన్నారు