మన్యం న్యూస్ దుమ్ముగూడెం ఏప్రిల్ 07::
మండలంలోని ధర్మారం ఢీకొత్తగూడం గ్రామంలో శుక్రవారం ప్రమాదవశాస్తూ అగ్ని ప్రమాదం జరిగి ఇల్లు కాలిపోయి సర్వం కోల్పోయిన కుటుంబాలకు దుమ్ముగూడెం బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిత్యవసర సరుకులు వంట సామాగ్రి వితరణ చేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు అన్నే సత్యాలు మాట్లాడుతూ అగ్ని ప్రమాదం సర్వం కోల్పోయిన కుటుంబాలకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు కృషి చేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి కనితి రాముడు ఉపాధ్యక్షుడు తునికి కామేశ్వరరావు అధికార ప్రతినిధి ఎండి జానీ పాషా స్థానిక సర్పంచ్ రామకృష్ణ అంజి పాక సర్పంచ్ నాగేంద్రబాబు ప్రచార కమిటీ అధ్యక్షులు శ్రీనివాసరావు బీసీ సెల్ కార్యదర్శి వెంకటేశ్వర్లు నాయకులు గంగరాజు రాము సీతారాం వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు