మన్యం న్యూస్ నూగూర్ వెంకటాపురం
ములుగు జిల్లా నుగూరు వెంకటాపురం లో కేంద్ర ప్రభుత్వం నిధులతో జూనియర్, డిగ్రీ కళాశాల, లా కళా శాల , మెడికల్ కాలేజీ, జ్యుడీషియల్ కోర్ట్ అదనపు జిల్లా కోర్టు, ఆర్డిఓ ఆఫీస్ , ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయాలని వెంకటాపురం మండలం కేంద్రం లో బై పాస్ రోడ్ ఏర్పాటు చేయాలని , కోరుతూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కి హైకోర్టు,సుప్రీమ్ కోర్ట్ అడ్వకేట్ పిట్టా శ్రీనివాస రెడ్డి వినతి పత్రం సమర్పించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడికి సమస్యలు తెలిపి మేడారం సమ్మక్క సారలమ్మ గుడి అభివృద్ధి భక్తుల సౌకర్యార్ధంరూ. 1000కోట్లు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలని, మేడారం సమ్మక్క సారలమ్మ పుణ్య క్షేత్రం ఇండియా లో రెండవ కుంభ మేళా గా పేరు పొందిన అమ్మవారి దేవాలయం దర్శన ము కొరకు కోట్లాది మంది భక్తులు దర్శించు మొక్కులు తీర్చుకుంటారు అని , అలాగే తెలంగాణ నయా గర జలపాతం గా పేరు గాంచిన బొగత జలపాతం వద్ద టూరిజం డెవలప్మెంట్ కొరకు యా త్రికుల సౌకర్యం సదుపాయం కొరకు రూ.100 కోట్ల నిధులు కేటాయించాలని,వాజేడు మండం లము లోని మోడీ కుంట వాగు ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణం కొరకు రూ.300కోట్ల రూపాయలు నిధులు కేటాయించాలని, అకాల వర్షాలు కురిసి పంటలు దెబ్బతిన్న రైతులకు నష్ట పరిహారం చెల్లించాలని రైతులను ఆదుకోవాలి అని పిట్టా శ్రీనివాస రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపినట్టు వారు తెలియజేశారు.
