మన్యం న్యూస్, అశ్వరావుపేట, ఏప్రిల్ 07: అశ్వరావుపేటలోని స్థానిక గుడ్ న్యూ స్కూల్ చర్చిలో సిలువ మార్గం ఎంతో భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఫాదర్ జోషి, సహాయ గురువులు ఫాదర్ టోనీ ప్రసన్న ఆధ్వర్యంలో ఈ సిలువ మార్గం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి నెహ్రూ నగర్, పేరాయిగూడెం, అచ్యుతాపురం, అనంతారం, గాండ్లగూడెం నుంచి క్రైస్తవ సోదరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫాదర్ టోనీ ప్రసన్న మాట్లాడుతూ ఈ యొక్క సిలువ మార్గం గుడ్ ఫ్రైడే రోజున నిర్వహిస్తారని, అంటే లోకంలోని మానవులందరి రక్షణార్థం కోసం యేసుక్రీస్తు అందరి పాపాలు తనమీద వేసుకొని సిలువపై ప్రాణాలర్పించారు. అదే విధంగా అందరూ కూడా ఏసుక్రీస్తును పోలి ఒకరి ఎడల ఒకరు ప్రేమ శాంతి సమాధానం కలిగి జీవించాలని అన్నారు. ఈ యొక్క సిలువ మార్గం స్థానిక నెహ్రు నగర్ నుంచి మోడల్ కాలనీ, పాత పేరాయి గూడెం నుంచి రింగ్ రోడ్ సెంటర్ మీదుగా గుడ్ న్యూస్ స్కూల్ చర్చీ వరకు సిలువ యాత్ర సాగింది. ఈ కార్యక్రమానికి పాధర్ దీపక్, ప్రిన్సిపాల్ సిస్టర్ డెల్బి, సిస్టర్ రోస్లీ, సంఘ కాపరులు జోసెఫ్ డి చార్లెస్ డి శ్యాంసుందర్ డేవిడ్ పాల్ పాస్టరమ్మ ప్రభావతి, సంఘ పెద్దలు జుజ్జారపు రాంబాబు, టి నిర్మల, యన్ మధు, వి పార్వతి, జె అప్పారావు, బి ప్రసాద్, జి కరుణ, కే శేఖర్, నాగు మాస్టర్, రాములమ్మ, యన్ లక్ష్మణ్ రావు తదితరులు పాల్గొన్నారు.