మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
నేడు దేశాన్ని పాలిస్తున్న కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక , ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలపై ప్రజానాట్యమండలి కళాకారులు ఆట పాట కార్యక్రమం ద్వారా ప్రజల్ని చైతన్య పరచాలని తెలంగాణ ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి వేముల కొండలరావు పిలుపునిచ్చారు. శుక్రవారం జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలోని శేషగిరి భవన్లో తెలంగాణ ప్రజానాట్యమండలి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు ఆదేర్ల సురేందర్ అధ్యక్షతన కళాకారుల సమావేశం జరిగింది .ఈ సందర్భంగా కొండలరావు మాట్లాడుతూ దేశ ప్రజల ఆస్తుల్ని, ప్రభుత్వ భూములను, దేశ సహజ వనరులని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతున్న తీరును దుయ్యబట్టారు. మతాన్ని రాజకీయంతో మూడు పెట్టి ప్రజల మధ్య విభేదాలు సృష్టించి, దేశంలో అశాంతికి అల్లా కలలోలాలకు రాజ్యం పోస్తున్నారని విమర్శించారు. ఎలాంటి ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజా కళాకారులు ఆటపాట కార్యక్రమాలతో ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి కాటూరి రాము నాయకులు, పండగ రాంబాబు కనకం కొమరయ్య ,పాములపల్లి కొమరన్న, రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.